'అలా మొదలైంది' షో ప్రతీ వారం మస్త్ ఎంటర్టైన్మెంట్ తో సాగుతోంది. అలాంటి ఈ షోకి నెక్స్ట్ వీక్ సింగర్ చిన్మయి, యాక్టర్ రాహుల్ రవీంద్రన్ వచ్చారు. వాళ్ళ మీద హోస్ట్ వెన్నెల కిషోర్ చెప్పిన ఇంట్రోనే వావ్ అనిపించేదిలా ఉంది. "మంచితనానికి మాయిశ్చరైజర్ పెడితే రాహుల్ రవీంద్రన్...సత్యానికి శానిటైజర్ పెడితే చిన్మయి" అని చెప్పి ఇన్వైట్ చేసాడు. షోలో హోస్ట్ ఉన్నాడన్న విషయమే మర్చిపోయిన రాహుల్ ఏదో మాట్లాడేస్తూ ఉన్నాడు. "నన్ను టీవీ హోస్ట్ లా చూడండి...అప్పుడప్పుడు నన్ను కూడా మాట్లాడనివ్వరా..రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడండి" అన్నాడు కిషోర్. "నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ అబ్బాయేవరో చాలా క్యూట్ గా ఉన్నాడు కదా" అని నాగురించి అనుకుందట చిన్మయి.. ఆ విషయాన్ని పెళ్లి తర్వాత చెప్పింది అని రాహుల్ చెప్పేసరికి చిన్మయి ఆ విషయాన్ని ఒప్పుకోకుండా "ఏదో వాగుతున్నాడు" అంది ఫన్నీగా.."చిన్మయిని కలిసే ముందు పెళ్లి వద్దనుకున్నా..కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒకటి చెప్పా" అని రాహుల్ చెప్పేసరికి ..."నేను కూడా పెళ్లి వద్దనుకున్నా..నువ్వేమీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏమీ చెప్పలేదు" అని చిన్మయి. "అంత ఇంటరెస్ట్ లేనప్పుడు నేనెందుకు దిగజారిపోవాలి అని గట్టిగా ఫిక్స్ ఇపోయా..అరగంట తర్వాత ఏదో మనసులో కొడతా ఉంది" అని సీరియస్ ఫ్లోలో చెప్తున్న రాహుల్ మాటలకు అడ్డొచ్చాడు కిషోర్. "ఎన్ని సార్లు మనం దిగజారిపోయి ఉంటాం" అని కిషోర్ కౌంటర్ వేసాడు.
వీళ్ళను సందీప్ కిషన్ కలిపాడు అనే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పారు ఇద్దరూ. "నువ్వు రాహుల్ ని మీట్ అవ్వాలి, కలవాలి అంటూ నా గురించి చిన్మయి దగ్గర బాగా మార్కెటింగ్ చేసాడు" అని రాహుల్ చెప్పేసరికి " మార్కెటింగ్ లో సందీప్ ది వేరే లెవెల్.." అన్నాడు కిషోర్. చిన్మయికి రాహుల్ కి మధ్య చిన్న గొడవ క్రియేట్ చేయడానికి కిషోర్ ఎంతో ట్రై చేసాడు. "రాహుల్ కి ఒక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ ఉంది తెలుసా...సీక్రెట్ గా యూరోప్ ట్రిప్స్ ఎందుకు వెళ్తాడో తెలుసా" అని చిన్మయిని అడిగేసరికి ఆమె నవ్వేసింది. తర్వాత చిన్మయి డెలివరీ విషయం గురించి కొన్ని మూమెంట్స్ ని షేర్ చేసుకున్నాడు. "చిన్మయికి అనెస్థీషియా ఇచ్చారు. పాడమని అడిగారు డాక్టర్స్..ఆమె పాడుతోంది. అది చూసాక ఏం జరుగుతోందో నాకు అర్థంకాక కళ్ళు తిరిగి కింద పడిపోయాను. తర్వాత ధ్రిప్తను తీసుకొచ్చి చిన్మయి పక్కన పడుకోబెట్టగానే చిన్నగా నవ్వింది ధ్రిప్త" అని చెప్పాడు రాహుల్. ప్రోమో ఇలా ఎండ్ చేశారు. మరి ఇంకా ఏమేమి విషయాలను ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.